గ్రామ అభివృద్ధే లక్ష్యం..అవకాశం ఇవ్వండి!
గ్రామ అభివృద్ధే లక్ష్యం.. అవకాశం ఇవ్వండి!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని గుడుంబాయి తాండ టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నేనావత్ శ్రీనివాసులు నాయక్ అన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తనకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రజలందరి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.