మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!**
**మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!**
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
“మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా” అని లొద్దిపల్లె వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వెల్లంపల్లి రజితమ్మ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లంపల్లి ప్రభాకర్ రెడ్డితో కలిసి గ్రామంలోని వీధుల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రజితమ్మ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు సొంతంగా బోరు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. వెల్లంపల్లి ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నాగేంద్రనాథ్ రెడ్డి, చిన్నపుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి, వెంకట్రాముడు, గజ్జల వెంకటేశ్వర్లు, బొగ్గుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.