కలగోడులో కాలవ వసంతమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ గుమ్మగట్ట మేజర్ న్యూస్: కలగోడు!!
గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాలవ వసంతమ్మకు మద్దతుగా గ్రామంలో భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు,గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, కూటమి నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో కరపత్రాలతో, నినాదాలతో గ్రామమంతా హోరెత్తింది.
గ్రామాభివృద్ధే లక్ష్యం : వసంతమ్మ
ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కాలవ వసంతమ్మ మాట్లాడుతూ, గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించి కలగోడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసుల సహకారంతో గ్రామానికి అన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు,మహిళలు, పెద్దలు పెద్ద ఎత్తున తరలివచ్చి వసంతమ్మకు ఆశీర్వాదం అందించి, గెలిపించాలని పిలుపునిచ్చారు.