BREAKING
దశాబ్దాల కల సాకారం.. ప్రగతి పథంలో గ్రామసీమలు! సిల్వర్ లేక్‌తో విలువ వివాదంలో యూబీఎస్‌ను కోర్టులోకి లాగేందుకు ఎండీవర్ యత్నం కమలాపురం సర్పంచ్ వైకాపా వశం! ఏకగ్రీవంగా ఎన్నికైన బుగ్గన జయలక్ష్మి ఎస్.వి. డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఓపియాయిడ్ వ్యసనం చికిత్స ఔషధాలకు ఉన్న అడ్డంకి తొలగింపునకు అమెరికాలో కొత్త బిల్లు వైసిపి అభ్యర్థులను గెలిపించండి మాజీ ఎమ్మెల్యే బియ్యపు బ్రిటన్ జైలులో చిన్నారి హంతకుడు ఇయాన్ హంట్లీ హత్య వేలాది కార్తీకదీపం వెలుగులలో శివాలయం. రెండవ డివిజన్ లో ఘనంగా విజయోత్సవ వేడుకలు ప్రచారంలో దూసుకుపోతున్న ఫ్యాన్ బంగ్లాదేశ్‌లో వేతన ఆందోళనల ఉద్రిక్తత అన్నదాన కార్యక్రమం శరణు ఘోషతో మార్మోగిన లంపకలోవ అన్నదానం భగవంతునికి ప్రీతికరం వాతావరణ నిబంధనల సడలింపుతో ఆల్బెర్టాలో మళ్లీ పెరుగుతున్న గ్యాస్ ఫ్లేరింగ్

నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

Select Suryaa Now
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు భేష్  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

నరసరావుపేట : పల్నాడు వంటి సమస్యాత్మక జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శ కంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేస్తున్న కృషిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అభినందించారు. ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను బాధ్యతాయు తంగా పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు అప్రమ త్తంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. సమస్యాత్మక పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను గుర్తించి వాటిపై తక్షణమే స్పందించడంతోపాటు, ఎలాంటి అంశాలనూ దాచిపెట్టకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువస్తున్న తీరు అభినందనీయ మన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారు లకు ఎదురవుతున్న ఇబ్బందు లను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ పరిష్కారానికి చొరవ చూపుతున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు నిరంతరం సమాచారం అందిస్తూ, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత నిష్పక్షపాత వైఖరి అధికారుల బాధ్యతాయుతమైన పనితీరు కీలకమని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ అంశాల్లో పల్నాడు జిల్లా కలెక్టర్ అనుసరిస్తున్న విధానం ఇతర అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని అనిల్ చంద్ర పునేఠా ప్రశంసించారు.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…