గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి
గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెర్మల్
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....గ్రామాల్లో శాంతిభద్రతల వ్యవస్థ పటిష్టంగా చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రేష్మి పెర్మల్ అన్నారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో కేసులు యొక్క రికార్డులను పరిశీలించి
శాంతిభద్రతల వ్యవస్థపై పనితీరు పోలీస్ సిబ్బందికి గ్రామాల్లో జరుగుతున్న వివిధ సంఘటనలు,పరిరక్షణ నేరాల నియంత్రణ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అవాంఛనీయ సంఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలోని వివిధ గ్రామాల చిత్రపటం వివరాలను ఎస్ఐ బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలీస్ కమిషనర్ రేష్మి పెరమల్ కు మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసినా సిఐ శ్రీనివాస్ ఎస్ఐ బాలకృష్ణ,పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు.