BREAKING
అభివృద్ధిపై చర్చకు సిద్ధం కరువు సహాయక చర్యలు చేపట్టాలి అహల్య దేవి కుటుంబాన్ని పరామర్శించిన అయిత ప్రకాష్ రెడ్డి రుద్రారం లో ఇందిరమ్మ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ డేంజర్ జోన్ బాధితుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం పల్లె పల్లెకు మెపా మెగా హెల్త్ క్యాంపు పై గ్రామస్తులకు అవగాహన అక్రమ నిర్మాణాలపై జిడబ్ల్యూఎంసీ కొరడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం 8వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను నమ్మవద్దు పార్టీ ఆదేశాలు అధిగమిస్తే ఉపేక్షించేది లేదు 48 ఒడిశా మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు. మన ఓటు.. మన శ్రీకాకుళం భవిష్యత్తు: ఆదరించండి, అభివృద్ధి కి అవకాశం ఇవ్వండి.

10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..!

Select Suryaa Now
10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..!

- 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
 
-సర్పంచ్ పీఠాల కోసం రసవత్తర పోరు!
 
పుట్లూరు, మేజర్ న్యూస్: పుట్లూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. మండలంలోని మొత్తం 23 గ్రామ పంచాయతీలకు గాను 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 10 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. గ్రామాల్లో రాజకీయ సమీకరణాలు, స్థానిక నాయకుల చర్చలు, గ్రామ పెద్దల సంప్రదింపుల నేపథ్యంలో పలు గ్రామ పంచాయతీల్లో ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏకగ్రీవమైన గ్రామాల్లో ఎ.కొండాపురం, దోసలేడు, మడ్డిపల్లి, మడుగుపల్లి, జంగంరెడ్డిపేట, పుట్లూరు, బాలాపురం, కోమటికుంట్ల, సి.వెంగన్నపల్లి, ఎస్.గూడూరు, గాండ్లపాడు, తక్కళ్లపల్లి, కొండేపల్లి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరోవైపు మిగిలిన 10 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. కుమ్మనమల, రంగరాజుకుంట, ఎల్లుట్ల, కందికాపుల, అరకటవేముల, సూరేపల్లి, చెర్లోపల్లి, గరుగు చింతలపల్లి, చాలవేముల, కడవకల్లు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే తమ తమ గ్రామాల్లో ప్రజలను కలుస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న స్థానిక రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, ప్రజల ఆదరణ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక పరిపాలనలో కీలకమైనవి కావడంతో ప్రతి గ్రామంలోనూ సర్పంచ్ ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, గ్రామాభివృద్ధి వంటి సమస్యలను పరిష్కరించగల నాయకత్వం కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారు. మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలకు గాను 13 ఏకగ్రీవం కావడంతో ఏకగ్రీవ గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉండగా, మిగిలిన 10 గ్రామాల్లో ఎన్నికల పోరు నెలకొననుంది. దీంతో పుట్లూరు మండలంలో ఈసారి సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి