పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ఆత్మ సౌజన్యంతో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తపేట మండలం గంటి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం,నానో ఎరువుల వినియోగం,భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యంపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ ఏవీఎస్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.పచ్చిరొట్ట ఎరువులు,నానో ఎరువులు,జీవ ఎరువుల వినియోగం,వాటి ప్రయోజనాలను వివరించారు.మండల వ్యవసాయ అధికారి కె.ద్వారకాదేవి మాట్లాడుతూ ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానం,పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం శిక్షణలో పాల్గొన్న రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మ ఏటీఎం నాగేశ్వరరావు,గ్రామ వ్యవసాయ సహాయకురాలు నిహారిక,ఏపీసీఎన్‌ఎఫ్ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.