BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

అసైన్డ్‌ భూమిలో నుండి ప్రైవేట్‌ వెంచర్‌కు రహదారి

Select Suryaa Now
అసైన్డ్‌ భూమిలో నుండి ప్రైవేట్‌ వెంచర్‌కు రహదారి

కొండాపూర్‌;మండల పరిధిలోని కొండాపూర్‌ శివారులో ఉన్న ప్రభుత్వ అసైన్డ్‌ భూమి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మామాదాపూర్ ‌ శివారులో ఏర్పాటు చేసిన  వెంచర్స్‌ విల్లాల నిర్మాణానికి, కోనాపూర్‌ శివారులోని సర్వే నంబర్‌ 180లో ఉన్న అసైన్డ్‌ భూమి నుంచి సుమారు 40 ఫిట్ల వెడల్పుతో రహదారి ఏర్పాటు చేసారు  సుమారు మూడేళ్ల క్రితం ఈ మార్గంలో సీసీ రోడ్డు వెంచర్‌ నిర్వహకులు ఏర్పాటు చేశారు రాకపోకల కోసం ఉపయోగిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వెంచర్‌ అవసరాలకు వినియోగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.తీర్మానాలు ఇచ్చారనే వాదనలు.. అనుమతులపై సందేహాలు!వెంచర్‌ నిర్వాహకులు అప్పటి గ్రామ పంచాయతీ పాలకవర్గం, ఎంపీటీసీ తీర్మానాలు ఇచ్చారని, అసైన్డ్‌ రైతులు కూడా అంగీకరించారని చెబుతున్నట్లు సమాచారం. తహసీల్దార్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకున్నట్లు కూడా నిర్వాహకులు పేర్కొంటున్నట్లు తెలిసింది. , గ్రామ పంచాయతీ తీర్మానం  అంగీకారం ఉన్నంత మాత్రాన ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని ప్రైవేట్‌ సంస్థ అవసరాలకు వినియోగించేందుకు చట్టబద్ధమైన అనుమతి లభించినట్లేనా? సంబంధిత శాఖల నుంచి ఏయే అనుమతులు పొందారు? వాటి ఆధారాలు ఏమిటి? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.వెంచర్‌ మామాదాపూర్ ‌ శివారులోని ప్రైవేట్‌ భూముల్లో ఉండగా, దానికి రహదారి కోసం మరో గ్రామ శివారులోని ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని ఎలా వినియోగించారు? రహదారి సౌకర్యం, భూమి వినియోగానికి సంబంధించిన అంశాలను పరిశీలించకుండా సంబంధిత అధికారులు అనుమతులు ఇచ్చారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక శాఖల రికార్డులను పరిశీలిస్తేనే అసలు విషయం వెల్లడయ్యే అవకాశం ఉంది.ఫిర్యాదులు చేసినా స్పందన ఏది?ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ, జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడేళ్లుగా రహదారి వినియోగం, విల్లాల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.మట్టి తరలింపు వెంచర్‌ రహదారులు, ఇతర నిర్మాణ పనుల కోసం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూముల నుంచి పెద్దఎత్తున మట్టి తరలించారు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నాయా? ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలించడం వల్ల జరిగిన నష్టమెంత? అనే అంశాలపై రెవెన్యూ, గనులు, ఇతర సంబంధిత శాఖలు సంయుక్తంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా?ఈ వ్యవహారం వెనుక కొండాపూర్‌ మండలానికి చెందిన ఓ బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత ఉన్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక నిర్ధారణ లేదు. సంబంధిత వ్యక్తుల పాత్రపై కూడా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.అనుమతులు.. గడువు.. అధికారుల బాధ్యతలపై స్పష్టత ఏది?వెంచర్‌కు డీటీసీపీ లేదా ఇతర శాఖల నుంచి ఎలాంటి అనుమతులు మంజూరయ్యాయి? గ్రామ పంచాయతీ తీర్మానం ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు? తహసీల్దార్‌ ఎన్‌ఓసీ జారీ చేశారా? అసైన్డ్‌ భూమి వినియోగానికి సంబంధించి సమర్థ అధికారి అనుమతి ఉందా? వెంచర్‌ అనుమతుల గడువు ఎంత? గడువు ముగిసినట్లయితే పునరుద్ధరణ జరిగిందా? అనే అంశాలను సంబంధిత శాఖలు రికార్డుల ఆధారంగా వెల్లడించాల్సి ఉంది.ప్రభుత్వ అసైన్డ్‌ భూములు ప్రజా ప్రయోజనాలకు, అర్హులైన లబ్ధిదారుల హక్కులకు సంబంధించినవని, వాటిని ప్రైవేట్‌ అవసరాలకు వినియోగించినట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణకు ఆదేశించి, రహదారి నిర్మాణం, భూమి వినియోగం, మట్టి తరలింపు, వెంచర్‌ అనుమతులపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.