BREAKING
27వ వార్డులో గిరిబాబు ముమ్మర ప్రచారం రాష్ట్రస్థాయి పోటీలకు పథకమూరు విద్యార్థులు. ఆదర్శ వెల్దుర్తియే లక్ష్యం: తిరివీధి రమేష్‌ శెట్టి జాతీయ స్థాయి పోటీలకు కొత్తపల్లి విద్యార్థులు. శరణు ఘోషతో మారుమ్రోగిన శంకరాపురం. పైడితల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు* *సోమవారం తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు* 31వ వార్డులో ఎన్నికల ప్రచారానికి ఊపు 53వ డివిజన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్.. కార్యకర్తల కోలాహలం.. డప్పుల మోతతో సందడిగా ప్రారంభోత్సవం ఎన్నికల విధులపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ 29వ వార్డులో పవిత్ర రఘు ఎన్నికల ప్రచార సందడి గూడూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయం :డమాం సురేష్ ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన... ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి... కాంగ్రెస్ నాయకులు పిలుపు సిఐడి పోలీసుల అదుపులో నలుగురు రైస్ మిల్లర్లు 44వ డివిజన్‌లో కూటమి నేతల విస్తృత ప్రచారం.మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్,

అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి... కాంగ్రెస్ నాయకులు పిలుపు

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి... కాంగ్రెస్ నాయకులు పిలుపు

లింగాలఘణపూర్, మేజర్ న్యూస్, రాబోయే వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్ గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ కో-ఆర్డినేటర్ నర్సింగ రమేష్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, విద్యావంతులైన పట్టభద్రులు తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్దేశిత గడువులోగా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు, ఉద్యోగులు తగిన ధ్రువపత్రాలతో ఫారం-18 ద్వారా తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాదం విజయ మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు దామెర నాగరాజు, వార్డు సభ్యుడు బత్తిని వేణు గౌడ్, మండల కార్యదర్శి కొయ్యడ రామలింగం గౌడ్, ముఖ్య నాయకులు జెగ్గం ఆనంద్, ఎడ్ల జాన్, దామెర రాజు, నర్సింగ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,గన్ను కార్తీక్ , లింగాలఘణపూర్ , జనగామ జిల్లా