పైడితల్లి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు* *సోమవారం తొలేళ్ల ఉత్సవానికి ఏర్పాట్లు*
విజయనగరం, అక్టోబర్ 25, మేజర్ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనార్థం విజయనగరంలో భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఆలయ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి, అమ్మవారిని దర్శించుకుని ఘటాలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శిరీష పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ దర్శనాలు వేగవంతంగా సాగేలా చర్యలు చేపట్టారు.
మరోవైపు విజయనగరం పండగ వాతావరణాన్ని సంతరించుకోగా, సోమవారం ఎంతో విశిష్టమైన ‘తొలేళ్ల ఉత్సవం’, ఎల్లుండి మంగళవారం అత్యంత వైభవంగా జరిగే ప్రసిద్ధ ‘సిరిమాను సంబరం’ నిర్వహణకు జిల్లా యంత్రాంగం వేగంగా, విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్ట భద్రత, తాగునీరు, క్యూ లైన్ల నిర్వహణ వంటి అన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం