శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం: విజయనగరంలో ముమ్మర ట్రాఫిక్ ఆంక్షలు & పార్కింగ్ మార్గదర్శకాలు
విజయనగరం మేజర్ న్యూస్
విజయనగరం పట్టణంలో ఘనంగా జరగనున్న శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని, భక్తుల సౌకర్యార్థం మరియు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు విజయనగరం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎ.ఆర్. దామోదర్ (A.R. Damodhar ) ఉత్తర్వుల మేరకు సమగ్ర ట్రాఫిక్ డైవర్షన్లు, పార్కింగ్ ప్రదేశాలు మరియు వాహనాల నిషేధ ప్రాంతాల వివరాలను జిల్లా పోలీసులు వెల్లడించారు.
ఈ ఆంక్షలు అక్టోబర్ 26 ఉదయం 6:00 గంటల నుండి అక్టోబర్ 27 రాత్రి 11:00 గంటల వరకు అమలులో ఉంటాయి.
భారీ వాహనాల మళ్లింపు (డైవర్షన్లు):
* గజపతినగరం వైపు నుండి విశాఖ వెళ్లే భారీ వాహనాలు: గొట్లం వద్ద తప్పనిసరిగా బైపాస్ మీదుగా వెళ్లాలి.
* విశాఖ/విజయనగరం రాజపు లోప వైపు నుండి వచ్చే వాహనాలు: చెల్లూరు బైపాస్ మీదుగా వెళ్లాలి.
* నెల్లిమర్ల, చీపురుపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు: రాజీవ్‌నగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు (Left) తిరిగి నాతవలస మీదుగా ప్రయాణించాలి.
భక్తుల వాహనాల పార్కింగ్ వివరాలు (అక్టోబర్ 27న ఉ. 8:00 నుండి రాత్రి 11:00 వరకు):
1. విశాఖపట్నం, కోరుకొండ, జామి, ఆలమండ వైపు నుండి వచ్చే వాహనాలు (కార్లు, ఆటోలు, బైక్‌లు):
* ఎత్తు బ్రిడ్జి, మయూరి జంక్షన్, RTC కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మీదుగా చేరుకుని — కాశీరాజు సర్కస్ గ్రౌండ్, అయోధ్య మైదానం, M.R. కాలేజ్ బాయ్స్ హాస్టల్ మైదానం వద్ద పార్కింగ్ చేయాలి.
2. డెంకాడ, నాతవలస, శ్రీకాకుళం, భోగాపురం వైపు నుండి వచ్చే వాహనాలు:
* కార్లు & ఆటోలు: రాజీవ్‌నగర్ జంక్షన్, దాసన్నపేట జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా — పోర్ట్ సిటీ పాఠశాల, దాసన్నపేట రైతుబజార్ వెనుక రాజుగారి సైట్, అయ్యకోనేరు పార్కింగ్ స్థలం, రాజీవ్‌నగర్ స్కూల్, SVN లేఅవుట్ లలో పార్కింగ్ చేయాలి.
* ద్విచక్ర వాహనాలు: రాజీవ్‌నగర్ జంక్షన్ మీదుగా అయ్యకోనేరు, పోర్ట్ సిటీ స్కూల్, లేదా SVN లేఅవుట్ పార్కింగ్ స్థలాలను ఉపయోగించుకోవాలి.
3. నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజం, గరివిడి, గుర్ల వైపు నుండి వచ్చే వాహనాలు:
* కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్, కొత్తపేట మండపం, పాత బస్టాండ్ మీదుగా — రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియం & DSDO ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో పార్కింగ్ చేయాలి.
4. గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, గంట్యాడ, ఎస్.కోట వైపు నుండి వచ్చే వాహనాలు:
* కలెక్టర్ ఆఫీస్, గూడ్స్ షెడ్ జంక్షన్ మీదుగా — CMR షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, PG స్టార్ హాస్పిటల్ ప్రక్క స్థలం, SBI మెయిన్ జంక్షన్ నుండి రామానాయుడు రోడ్డులోని ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి.
వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించబడిన ప్రాంతాలు:
అక్టోబర్ 27న ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు ఈ క్రింది మార్గాల్లో అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు:
* బాలాజీ జంక్షన్ నుండి సింహాచలం మేడ జంక్షన్ వరకు
* సింహాచలం మేడ జంక్షన్ నుండి విజయనగరం కోట వరకు
* బాలాజీ జంక్షన్ నుండి గంటస్తంభం (Clock Tower) వరకు
* ఎం.ఆర్. కాలేజ్ (M.R. College) రహదారి
* కన్యకా పరమేశ్వరి గుడి నుండి గంటస్తంభం వరకు
* రాజీవ్ స్టాండ్ నుండి గంటస్తంభం వరకు
* శరత్ లాడ్జ్ జంక్షన్ నుండి శివాలయం మీదుగా M.G. రోడ్డు వరకు
* కమ్మవీధి కాంప్లెక్స్ జంక్షన్ నుండి మూడు లాంతర్ల కూడలి వరకు
* గుంచీ జంక్షన్ నుండి కోట జంక్షన్ వరకు
⚠️ పోలీసుల విజ్ఞప్తి & హెచ్చరిక:
భక్తులందరూ పోలీసులకు సహకరించి నిర్దేశించిన ప్రదేశాల్లోనే తమ వాహనాలను పార్కింగ్ చేయాలని కోరడమైనది. నిషేధిత ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీ జరిమానా విధిస్తారని అధికారులు హెచ్చరించారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం