యేసుప్రభు ఆశీర్వాదం పొందిన వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ ఆదివారం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లోని చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
యేసుప్రభు కృపతో తమకు శక్తి, ధైర్యం లభిస్తున్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. తనకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని క్రైస్తవ సోదరులను కోరారు.
అనంతపురం నగర అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం అందించిన సేవలను గుర్తుచేస్తూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
యేసుప్రభు ఆశీర్వాదంతో ఎన్నికల్లో విజయం సాధించి, నగర ప్రజల అందరి సంక్షేమం కోసం పనిచేస్తానని రమేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. చర్చిలో ప్రార్థనలు, ఆశీర్వచనాలు అందుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యకర్తలు, స్థానికులతో కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.