BREAKING
దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి MPTC, ZPTC ఎన్నికలు: బరిలో వేలాది మంది అభ్యర్థులు.. తుది జాబితా విడుదల! గంగానమ్మ అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి స్థానికులకు అందుబాటులో ఉంటాం... -64, 66 డివిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : కార్పొరేటర్ అభ్యర్థులు అన్నా మల్లీశ్వరి, అన్నా లోకేష్ జెడ్పీటీసీ నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్ల స్వీకరణ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేల హామీ రేణిగుంట సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం ముంబై బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్‌లో సింగర్ శిల్పా రావుకు చేదు అనుభవం.. మధ్యలోనే షో ఆపేయడంతో అభిమానుల ఆగ్రహం!

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ

Select Suryaa Now
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ

????నవంబర్ 1న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మునుగోడు,మేజర్ న్యూస్:

మునుగోడు మండల ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 1, ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పలివెల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మండల కార్యవర్గ సభ్యులు ఆనగంటి కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మునుగోడు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉదయం 9 గంటల నుంచి ఈ శిబిరం ప్రారంభమవుతుందని వెల్లడించారు.50 సంవత్సరాల వయస్సు పైబడిన వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డుతో పాటు ఫోన్ నంబర్, గతంలో ఉపయోగించిన మందులను వెంట తీసుకురావాలని సూచించారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు తగిన చికిత్స అందించనున్నట్లు తెలిపారు.కంటి శుక్లాల సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించి, హైదరాబాద్‌కు తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించి తిరిగి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.