BREAKING
లక్నో నా కథలకు అసలైన ప్రాణం.. ప్రముఖ రచయిత దివ్య ప్రకాష్ దూబే ఆసక్తికర వ్యాఖ్యలు! సీఎం అండతోనే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అరాచకాలు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరోపణ DHRC కరీంనగర్ జిల్లా నూతన కమిటీ నియామకాలు విడుదలకూ ముందే బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ ప్రభంజనం.. ఐమ్యాక్స్ టికెట్లకు విపరీతమైన డిమాండ్! జన్నారం మండలం మహేంద్ర యూత్ కమిటీ ఎన్నిక అక్క తప్పకుండ మా ఓట్లు మీకే... -ఆకారం పల్లి ప్రచారంలో ఓటర్లు భరోసా సైఫ్ అలీ ఖాన్ నివాసంలో దుండగుడి దాడి కలకలం.. కోటి రూపాయలు డిమాండ్ చేశాడంటూ నర్సు సంచలన వాంగ్మూలం! మార్క్ నాప్లర్ 120కి పైగా గిటార్లు మరియు ఆంప్స్ వేలం.. రూ. 93 కోట్లకు పైగా సేకరించి స్వచ్ఛంద సంస్థలకు విరాళం! అవించి జ్ఞాపకాలతో మానసిక ఆరోగ్య నిధి.. వ్యక్తిగత వస్తువుల వేలంతో 7.7 మిలియన్ క్రోనార్లు సమీకరించిన కుటుంబం! తవక్కల్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. • మంత్రి వివేక్‌, ఎంపీ వంశీకృష్ణకు AISB ఫిర్యాదు విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం బీఎమ్‌పీ 2026లో గందరగోళం.. కర్ఫ్యూ దాటి పాడిన హిమేష్ రేషమియా, సగంలోనే ఆగిపోయిన శిల్పా రావు ప్రదర్శన! నాయకత్వం గొట్టిపాటి లక్ష్మిది విజయం మనది. బిసి సబ్ ప్లాన్ కు ప్రత్యేక చట్టం కావాలి ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ విద్యార్థుల పోరాటానికి నసీరుద్దీన్ షా మద్దతు.. బిజెపిపై సీనియర్ నటుడి ఘాటు విమర్శలు!

అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ

Select Suryaa Now
అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ

దంతాలపల్లి, మేజర్ న్యూస్, అనాథ వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ బాలవికాస సంస్థ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా  దంతాలపల్లిలోని బాలవికాస కార్యాలయంలో దాతల సహకారంతో ఉమ్మడి మండల పరిధిలోని 50 మంది అనాథ వృద్ధులకు, 12 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు పప్పులు, నూనె, చింతపండు, రవ్వలు, సబ్బులు, బిస్కెట్‌ ప్యాకెట్లు, బ్రెడ్‌, స్వీట్లు, పండ్లు తదితర వస్తువులను అందజేశారు.
బాలవికాస ఆధ్వర్యంలో ఇప్పటివరకు 700 మంది అనాథ వృద్ధులకు, 150 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా బాలవికాస ప్రాజెక్టు సమన్వయకర్త జ్యోతి కిరణ్‌ మాట్లాడుతూ అనాథ వృద్ధులకు బాలవికాస సంస్థ, దాతలు, గ్రామ నాయకులు, గ్రామస్తులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. వృద్ధులు సంతోషంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్‌ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ అనాథ వృద్ధులను గుర్తించి దాతల సహకారంతో వారికి అవసరమైన వస్తువులను అందించడం అభినందనీయమన్నారు. బాలక్క శిక్షణ, మార్గదర్శకత్వంలో బాలవికాస సంస్థ ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని ప్రశంసించారు. సహాయం చేయాలనే మనసున్నవారు చాలామంది ఉన్నప్పటికీ, వారిని సమన్వయం చేసి అవసరమైన వారికి సాయం అందించే సంస్థలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అనాథ వృద్ధుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టు నాయక్‌ మాట్లాడుతూ.. ఇతరులు చేయలేని ఎన్నో సేవా కార్యక్రమాలను బాలవికాస సంస్థ చేపడుతోందని కొనియాడారు. నీటి శుద్ధి కేంద్రాలు, మహిళా అభివృద్ధి, రైతుల సంక్షేమం, విద్యాభివృద్ధి, అనాథ పిల్లల సంక్షేమం వంటి రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. బాలవికాస సంస్థ తమ మండలానికి పెద్దతల్లిలా అండగా నిలుస్తోందని అభివర్ణించారు.ఈ సేవా కార్యక్రమాలకు మరింతమంది దాతలు ముందుకు రావాలని కోరారు. తన వంతుగా ప్రతి సంవత్సరం రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తానని, ప్రతి సంవత్సరం ఆ మొత్తాన్ని రూ.500 చొప్పున పెంచుకుంటూ వెళ్తానని ప్రకటించారు. వృద్ధులకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. బాలవికాస, బాలక్క అందిస్తున్న సహాయాన్ని వృద్ధులు ఎప్పటికీ మరువలేరని పేర్కొన్నారు.
దాతల సహకారంతో అందిన వస్తువులను చూసి వృద్ధులు భావోద్వేగానికి గురయ్యారు. తమను ఆదుకుంటున్న దాతలు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కార్యక్రమానికి దాతలుగా ముద్దసాని కిరణ్‌ కుమార్‌, ఏసీపీ గాదె అశోక్‌రెడ్డి, చిల్లంచర్ల వైస్‌ ఎంపీపీ జలగం సతీష్‌ గౌడ్‌, గిరిజన సంక్షేమ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి, నరేందర్‌ (హనుమకొండ), వీరబోయిన సుధాకర్‌ (విరమణ పశువైద్య అధికారి), పేరాల కాంతారావు, ఉడుగుల హరీష్‌, గంగమ్మ (పెద్దముప్పారం), దాట్ల శ్రీదేవి, జువెలర్స్‌ శ్రావణ్‌ కుమార్‌, చలమల్ల వినోద్‌ (పెద్దముప్పారం), ఉత్తం ఉపేందర్‌ (నిదానపురం), యాసాని వెంకటేశ్వర్లు (ఆగిపేట), గారి పెళ్లి కవిత, మంగయ్య తదితరులు సహకరించారు.
కార్యక్రమంలో పేరాల కాంతారావు, దాసరి శ్రావణ్‌ కుమార్‌, చలమల్ల వినోద్‌, బాలవికాస ప్రతినిధులు సుకన్య, మార్గం శోభారాణి, గుగ్గిళ్ల స్వర్ణలత, చిలకమారి యాకలక్ష్మి, గుగ్గిళ్ల స్వరూపరాణి, విలేజ్‌ లీడర్లు అంకం వెంకటరత్నం, సోమక్క, ఎస్‌.కె. చాంద్‌బీ, తుమ్మ నాగలక్ష్మి, కుంభాల నాగలక్ష్మి, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.