విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం
విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం
-బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు
సిద్దిపేట రూరల్ : విద్యార్థుల హక్కుల పరిరక్షణ, యువత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్వీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తున్నట్లు మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ తెలిపారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆదేశాలు, మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం రూరల్ మండలంలోని బండచర్లపల్లి, రావురూకుల గ్రామాల్లో నూతన విద్యార్థి కమిటీలను ఏర్పాటు చేశారు.బండచర్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా పోతురాజు నీరజ్ వర్మ, ఉపాధ్యక్షులుగా పొన్నాల ప్రశాంత్, మంగళారపు స్వామి, ప్రధాన కార్యదర్శిగా బొందని భరత్, సామాజిక మాధ్యమాల బాధ్యుడిగా మంగళారపు నాగరాజును నియమించారు.రావురూకుల గ్రామ అధ్యక్షుడిగా నీరటి రఘు, ఉపాధ్యక్షులుగా బోడ లోకేష్, తడకపల్లి సంజయ్ (సాయి), ప్రధాన కార్యదర్శిగా ఏర్పుల ప్రవీణ్, సామాజిక మాధ్యమాల బాధ్యుడిగా బోడ రోహిత్‌ను నియమించారు. రెండు గ్రామాల్లో మొత్తం 15 మందితో కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బండి శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులకు భంగం కలిగితే సహించేది లేదని, యువతకు న్యాయం జరిగే వరకు విద్యార్థి నాయకులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు బట్టు తిరుపతి, పొన్నాల నాగరాజు, బీఆర్ఎస్ యువజన నాయకుడు మొకిల్ల శ్రీకాంత్ రెడ్డి, విద్యార్థి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్)