BREAKING
మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు అయ్యప్ప స్వాముల మహా పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రొద్దుటూరు అభివృద్ధికి అదనపు నిధులు త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి

Select Suryaa Now
ప్రొద్దుటూరు అభివృద్ధికి అదనపు నిధులు  త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్: కూటమి ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తెలిపారు. స్థానిక కొర్రపాడు రోడ్డులోని ఎస్‌కేఎస్‌సీ డిగ్రీ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి నేతృత్వంలో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రత్యేక నిధులు కోరారని, పట్టణానికి రూ.45 కోట్ల గృహ నిర్మాణ నిధులతో పాటు అదనపు నిధులు రానున్నాయని వెల్లడించారు. వీటితో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన పోరెడ్డి నరసింహారెడ్డి నామినేషన్ వ్యవహారంపై కూడా విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాష విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. వ్యక్తిగత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మహిళలకు 20కి పైగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పులివెందులలోనూ కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని పేర్కొంటూ, ప్రజలు అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ విధ్వంసకర పరిస్థితులు ఏర్పడకూడదని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వి.ఎస్. ముక్తియార్, టీడీపీ యువ నాయకులు నంద్యాల కొండారెడ్డి, ఈ.వి. సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా