మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం...
మంత్రి తుమ్మల సుడిగాలి పర్యటన...
సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక )
పాత మిత్రులను పలకరిస్తూ... బాగున్నారా అని అడుగుతూ.. ప్రజా సమస్యలు వింటూ
బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం వేంసూరు మండలములో సుడిగాలి పర్యటన చేశారు. మర్లపాడు, కందుకూరు, దుద్దేపూడి గ్రామాల్లో పర్యటిస్తూ పాత మిత్రులతో సరదాగా ముచ్చటించి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మంత్రి తుమ్మల కొనసాగారు.
మర్లపాడు, కందుకూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
దుద్దుపూడి గ్రామంలో మట్టా పద్మావతి దశదినకర్మలో మంత్రి తుమ్మల పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే కల్లూరు మండలం బోడుమెళ్ళ గ్రామంలో ధాన్యం కాంటాలు వేస్తున్న రైతులు హమాలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను, సాధక బాధలను తెలుసుకున్నారు. ఎల్ నినో ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.