ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపట్టణంలోని 25వ వార్డు కురసాల సురేష్ నాయుడు ఏకగ్రీవ నియామక పత్రాన్ని అధికారికంగా స్వీకరించారు.ఆదివారం మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ సమక్షంలో మున్సిపల్ కమిషనర్, ఈఓ చేతుల మీదుగా ఆయన ఈ పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా కురసాల సురేష్ నాయుడు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన పెద్దలందరికీ, తనను ప్రోత్సహించిన చిక్కాల గణేష్‌కు, 25వ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సురేష్ నాయుడు తెలిపారు.