ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్:
సిఎస్ పురం,మేజర్ న్యూస్: మండల పరిషత్ ఎన్నికల్లో టిడిపి ఎంపిపి అభ్యర్థిగా ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మండలంలోని చెర్లోపల్లె గ్రామానికి చెందిన మండల టీడీపీ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకుడు,రెడ్డిగారికొత్తపల్లె ఎంపిటిసిగా టిడిపి తరపున పోటీచేస్తున్న డాక్టర్ బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు(వెంగయ్య)ను అధికారికంగా ప్రకటించడం పట్ల మండలంలోని కోవిలంపాడు పంచాయతీ ప్రముఖులు, మండల టిడిపి సీనియర్ నాయకులు, మైనారిటీనేత షేక్ బడేనాయబ్ రసూల్(చంద్రపూర్, మహారాష్ట్ర) హర్షం వ్యక్తంచేసి ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు హార్ధిక అభినందన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అన్నారు. ఈసందర్భంగా బడేనాయబ్ రసూల్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా మండలంలో టిడిపి అభివృద్ధికి విశేషకృషి చేసిన వెంగయ్యకు గతంలో ఎంపిపి పదవి చేజారిన పసుపుజెండాను వదలకుండా ప్రతికార్యక్రమంలో నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుని మండలంలో టిడిపిని అభివృద్ధి చేశారని కష్టానికి తగిన ఫలితంగా సుమారు ముప్పై సంవత్సరాల కిందట చేజారిన ఎంపిపి పదవి రావడంపట్ల వెంగయ్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అదేవిధంగా శ్రమించిన టిడిపి కార్యకర్తను గుర్తించి వెంగయ్యకు ఎంపిపి అవకాశం కల్పించిన నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత,ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంపిపి అభ్యర్థి డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్యకు ప్రత్యేక అభినందన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు టిడిపి మైనారిటీ నేత షేక్ బడేనాయబ్ రసూల్(చంద్రపూర్, మహారాష్ట్ర)అన్నారు.