BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

Select Suryaa Now
మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు  ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

సీతానగరం, అక్టోబరు 25 (మేజర్ న్యూస్): 

మానవత్వమే నిజమైన పోలీసు సేవకు నిదర్శనమని సీతానగరం పోలీసులు మరోసారి చాటుకున్నారు. కాసయ్యపేట, అంటిపేట గ్రామాల మధ్య గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందడంతో ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తక్షణమే స్పందించారు.

పోలీసు సిబ్బంది హెచ్‌సీ తిరుపతి, పీసీ ఈశ్వర్, అప్పలకొండ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, వీఆర్ఏ సమక్షంలో మృతుడు యాచకుడిగా గుర్తించి, మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.

కుటుంబ సభ్యులు, ఆత్మీయులు లేని అనాథ మృతదేహానికి కూడా గౌరవప్రదమైన వీడ్కోలు పలకడం ద్వారా సీతానగరం పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి స్పందించిన ఎస్‌ఐ ఎం. హేమలత, పోలీసు సిబ్బంది సేవాభావం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

పి సతీష్ కుమార్ స్టాప్ రిపోర్టర్ పార్వతీపురం మన్యం జిల్లా