అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో డిసెంబర్ 20 వరకు నిత్య అన్నసమారాధన
నిజాంపేట్ మేజర్ న్యూస్ :అయ్యప్ప స్వామి భక్తులకు సేవ చేయడమే దైవసేవగా భావిస్తూ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదివారం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప దీక్షాదారుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నసమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.
ఆదివారం నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగనుంది. అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సేవా దృక్పథాన్ని, సమాజంలో ఐకమత్యాన్ని బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ నాచారం మురళి యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, ఇంద్రకుమార్ దేవ్, సతీష్, హరిబాబు, 125వ డివిజన్ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు అభిషేక్ రెడ్డి, అయ్యప్ప స్వామి భక్తులు, దీక్షాదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.