మల్లవరంలో ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు ఒకేసారి రావడంతో పట్టణంలోనూ, గ్రామాల్లోనూ ఎన్నికల సందడి విస్తృతంగా కొనసాగుతుంది. మల్లవరం ఎంపీటీసీ అభ్యర్థిగా కూటమి పార్టీలోని బిజెపికి చెందిన బాల వెంకటేశ్వర్లు పోటీలో నిలిచారు. మల్లవరం, మల్లవరం లంక, కే బేతపూడి గ్రామాలు ఈ ఎంపీటీసీ పరిధిలోకి రావడంతో ఆదివారం ఆయన ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. 12 ఏళ్ల పాటు మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకత్వంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి బుల్లి సత్యం, నడిపూడి పెద్దిరాజు, జడ్డు మల్లికార్జునరావు, చలంకూరి బోసు, పులకండం ఆదిశేషు ఇతర కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.