BREAKING
అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం...

నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

Select Suryaa Now
నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

                                                      వనభోజనాల విజయవంతానికి సన్నాహక సమావేశం

కుత్బుల్లాపూర్ మేజర్ న్యూస్ :    శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 22న నిర్వహించనున్న కార్తీక వనభోజనాలను విజయవంతం చేసేందుకు ఆదివారం సూరారం కాలనీలోని ఆర్యవైశ్య భవన్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యక్రమ ఏర్పాట్లు, సభ్యుల భాగస్వామ్యం, నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పరాభవ నామ సంవత్సర కార్తీక శుద్ధ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 22వ తేదీ ఆదివారం కార్తీక వనభోజనాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు.

 ఈ సందర్భంగా అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి కార్తీక వనభోజనాలను విజయవంతం చేయాలని కోరారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సభ్యుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. సభ్యులందరూ బాధ్యతగా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన సలహాదారు సర్వేపల్లి రమేష్ కుమార్, సలహాదారు పరుశురామ శర్మ, కార్యవర్గ సభ్యులు గడ్డం రాంబాబు, కోడూరి జగదీష్, శ్రీధరాచార్యులు, ప్రభాకర్ శర్మ, మాలతి శ్రీనివాస్, సుబ్బలక్ష్మి సంజీవరావు, రమేష్ కులకర్ణి, సాయి సుందరి, రత్నమాల సుబ్బారావు, సుబ్రహ్మణ్య స్వామి, గోవర్ధన్ రావు, రఘురాం తదితరులు పాల్గొన్నారు.