32వ వార్డు టిడిపి అభ్యర్థినికి పెరుగుతున్న ప్రజాదరణ : కూటమి నేతలతో కలిసి తలారి రాధమ్మ విస్తృత ప్రచారం
మదనపల్లి,మేజర్ న్యూస్ : కూటమి బలపరిచిన 32వ వార్డు టిడిపి అభ్యర్థిని తలారి రాధమ్మకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది.ఆదివారం వార్డు పరిధిలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా తలారి రాధమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు.ప్రధాని మోడీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు.ఇక ఎమ్మెల్యే షాజహాన్ బాషా విషయానికి వస్తే నిరంతరం ప్రజా శ్రేయస్సుకు పరితపిస్తూ,మదనపల్లి పట్టణాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.మదనపల్లి జిల్లా ఏర్పాటు,హంద్రీ-నీవా జలాలను నియోజకవర్గానికి తీసుకురావడంలో ఆయన కృషి అమోఘమన్నారు.తనకు ఒక అవకాశం ఇస్తే 32వ వార్డును అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని,ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానన్నారు.గతంలో కౌన్సిలరుగా వార్డును ఎంతో అభివృద్ధి చేశానని గుర్తుచేశారు.త్వరలో జరుగబోవు మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు అభ్యర్థినిగా తనకు,మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,వార్డు ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి