BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం

ఖైరతాబాద్ మేజర్ న్యూస్: పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో అపోలో ఆసుపత్రి, జై జవాన్‌ జై కిసాన్‌ యువజన సంక్షేమ సంఘం, ప్రేమ్‌నగర్‌ బస్తీ కమిటీ సంయుక్తంగా ప్రేమ్‌నగర్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు అందించారు. శిబిరంలో కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, ఇతర ఆర్థోపెడిక్‌ సమస్యలకు సంబంధించి వైద్య సేవలు అందించారు. ప్రతి ఒక్కరికీ షుగర్‌, బీపీ పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారు. 

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పిల్లల పోషకాహారం, ఆహారపు అలవాట్లు, శారీరక ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించడం ద్వారా పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు తోడ్పడవచ్చని వివరించారు. వైద్య శిబిరం కోఆర్డినేటర్‌ నితిన్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు అర్హత కలిగిన ఇతర ఆరోగ్య కార్డుల ద్వారా నిబంధనలకు అనుగుణంగా ఉచిత వైద్య సేవలు, అవసరమైన శస్త్రచికిత్సలు అందించేందుకు అపోలో ఆసుపత్రి కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో మెగా హెల్త్‌ క్యాంప్‌
ప్రేమ్‌నగర్‌ పంచాయతీ కమిటీ మాజీ చైర్మన్‌ టీ. వెంకటేశం మాట్లాడుతూ అపోలో ఆసుపత్రి సహకారంతో త్వరలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిబిరంలో ఈసీజీ, 2డీ ఎకోతో పాటు వివిధ వైద్య పరీక్షలను ఉచితంగా అందించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రధాన కార్యదర్శి, జాతీయ యువజన అవార్డు గ్రహీత కె. భగవాన్‌ దాస్‌, కే.ఆర్‌. నర్సింగ్‌ రావు, బి. శ్రవణ్‌ కుమార్‌, జి. హర్షవర్ధన్‌, బి. మల్లేష్‌, ఆర్‌. సురేష్‌ కుమార్‌, మామిడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. శిబిరం విజయవంతానికి సహకరించిన వైద్య సిబ్బంది, యువజన సంఘం సభ్యులు, బస్తీ కమిటీ ప్రతినిధులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.