BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు నిర్ధారణ నుంచి పునరావాసం వరకు ఒకే వేదికపై.. కిమ్స్‌ రెనోవాలో ప్రత్యేక కార్యక్రమం

Select Suryaa Now
రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు  నిర్ధారణ నుంచి పునరావాసం వరకు ఒకే వేదికపై.. కిమ్స్‌ రెనోవాలో ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్‌, మేజర్ న్యూస్ ప్రతినిధి : రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్స, పునరావాస సేవలను ఒకే వేదికపై అందించే లక్ష్యంతో కొండాపూర్‌లోని కిమ్స్‌ రెనోవా క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పింక్‌ అక్టోబర్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చిన ఈ కార్యక్రమాన్ని బి-రెడీ, బి-అహెడ్‌, బి-యు అనే మూడు విభాగాలుగా రూపొందించారు. బి-రెడీ ద్వారా అధునాతన పరీక్షలతో క్యాన్సర్‌ను గుర్తించడం, బి-అహెడ్‌ ద్వారా శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలను నిపుణుల సమన్వయంతో అందించడం, బి-యు ద్వారా చికిత్స అనంతరం పునరావాస సేవలు కల్పించడం ప్రధాన లక్ష్యాలు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘పింక్‌ రూమ్‌’లో ఫిజియోథెరపీ, పోషకాహార సలహాలు, మానసిక ఆరోగ్య సహాయం, యోగా సేవలు అందించనున్నారు.
కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భాస్కర్‌ రావు బొల్లినేని మాట్లాడుతూ, రొమ్ములో గడ్డలు లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆంకాలజీ సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ సతీష్‌ పవార్‌ మాట్లాడుతూ, చికిత్సతో పాటు రోగులు శారీరకంగా, మానసికంగా కోలుకునేందుకు పునరావాస సేవలు కీలకమని తెలిపారు. నిర్ధారణ నుంచి కోలుకునే వరకు సమగ్ర సంరక్షణ అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.