BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్

Select Suryaa Now
హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :హెచ్ మ్యాట్ లో ఇకనుంచి ప్రతి శనివారం అనుభవజ్ఞులైన హోమియోపతి వైద్యులచే ఉచిత చికిత్స క్యాంపు నిర్వహిస్తున్నామని అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ప్రకటించారు. ఆదివారం
హోమియోపతిక్  మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( హెచ్ మ్యాట్ ),  విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ , హిమాయత్ నగర్ సంయుక్తంగా నిర్వహించిన సి. యం. ఇ .. జూపల్లి బాలమ్మ ఆడిటోరియం లో ఘనంగా జరిగింది. హోమియోపతి చికిత్స తో  ప్రయోజనం పొందిన  రాజ్ రాణి కపూర్ స్మృతిలో జరిగిన ఈ ఆరేషన్  ప్రారంభోత్సవంలో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు . అసోసియేషన్ అధ్యక్షుడు డా. కె. గోపాలకృష్ణ నేతృత్వం వహించి స్వాగతోపన్యాసం చేయగా ప్రధాన కార్యదర్శి డా. జి. దుర్గాప్రసాద్ రావు అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న వైద్య , ఇతర సేవా కార్యక్రమాల గురించి వివరించారు.  

ఈ నెల నుండి హెచ్ మ్యాట్ లో ప్రతి చివరి శనివారం రోజు ఉదయం 10 గం. నుండి  మధ్యాహన్నం 1 గం. వరకు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులచే ఉచిత చికిత్స్ క్యాంపు ను నిర్వహిస్తున్నట్లుగా డా. దుర్గాప్రసాద్ రావు తెలిపారు .ఈ సందర్భంగా విజయ డయాగ్నోస్టిక్స్ బయోకెమిస్ట్ డా. అఫ్రోజ్ హనీఫ్  ‘ డీ కోడింగ్ ది సెల్యూలర్ విస్పర్స్ ‘ అంశంపై ఉపన్యసించగా , కరీంనగర్ కు చెందిన హోమియో డాక్టర్ మణిద్రుపద్   ‘ క్లినికల్ కేసెస్ అండ్ ఇన్సైట్స్ ఇన్ టు రెమెడీ పాటర్న్స్ ‘  పై ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమం హెచ్ మ్యాట్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించడానికి సహకరించిన , విజయ డయాగ్నోస్టిక్స్  చైర్మన్ డా. యస్ .సురేందర్ రెడ్డి మరియు సి. ఇ. ఒ. సుప్రిత రెడ్డి గారికి అసోసియేషన్ అధ్యక్ష  , ప్రధాన కార్యదర్శులు ధన్యవాదములు తెలిపారు. విజయ డయాగ్నోస్టిక్స్ వారు డిన్నర్ స్పాన్సర్ చేసారు. 

చివరగా హెచ్ మ్యాట్ తరపున కార్యక్రమం స్పాన్సర్ , రాజ్ కిషోర్ కపూర్ చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీ  , వై. యస్. వి. ప్రసాద్ ను మరియు విజయ డయాగ్నోస్టిక్స్ మార్కెటింగ్ టీమ్ , టి . రాఘవేంద్ర , టి. విజేందర్ సింగ్ , టి. మల్లిఖార్జున్ రెడ్డి , ఎ. యస్ .అరుణ్ కుమార్ లను సత్కరించారు. హెచ్ మ్యాట్ సాంకేతిక సలహాదారుడు డా. సి.వి. స్వామి ముగింపు సందేశం ఇవ్వగా , ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. గౌతమ్ రాళ్లబండి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది . అసోసియేషన్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు , హోమియో ప్రాక్టీషనర్స్ , వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.