BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

బాలల సృజనాత్మక వికాసానికి పఠనం, ఆటపాటలు అవసరం

Select Suryaa Now
బాలల సృజనాత్మక వికాసానికి పఠనం, ఆటపాటలు అవసరం

హిమాయత్ నగర్, మేజర్ న్యూస్: పిల్లల హక్కులను గౌరవిస్తూ, వారి సృజనాత్మకతను ప్రోత్సహించే విద్యావాతావరణాన్ని కల్పించాలని బాలచెలిమి, దక్కన్‌ ల్యాండ్‌ పత్రికల సంపాదకుడు మణికొండ వేదకుమార్‌ అన్నారు. ఆదివారం తెలంగాణ సాహిత్య అకాడమి, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (ట్రస్మా) సహకారంతో డా. మాడభూషి రంగాచార్య స్మారక సంఘం హిమాయత్‌నగర్‌లోని ఆక్స్ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో నిర్వహించిన కార్యశాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదకుమార్‌ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలసాహిత్యం అభివృద్ధి చెందుతోందని, ఇటువంటి కార్యశాలలు సంబంధిత కృషిని సమీక్షించుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. 

పోటీ ప్రధానమైన విద్యావ్యవస్థలో పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతోపాటు పఠనం, సృజనాత్మక రచన, ఆటపాటలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అబ్దుల్‌ కలాం వంటి మహనీయులు సాధారణ విద్యాసంస్థల నుంచే ఎదిగారని గుర్తుచేశారూ. బాలచెలిమి పత్రికలోని విషయాలతోపాటు ముఖచిత్రం, వెనుక అట్ట రూపకల్పనపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వివరించారు. పిల్లల పత్రిక అయినప్పటికీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే అంశాలను కూడా అందిస్తున్నామని తెలిపారు. మలేషియా పర్యటనలో సందర్శించిన ఒరంగుటాన్‌ సహజ ప్రకృతి పార్కు అనుభవాలను పంచుకుంటూ, పిల్లల సంరక్షణకు సమయం, శ్రద్ధ కేటాయించాల్సిన అవసరాన్ని వివరించారు.

ఉదయం జరిగిన ప్రారంభ సమావేశానికి బాలసాహితీవేత్త గరిపెల్లి అశోక్‌ అధ్యక్షత వహించగా, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి డా. నామోజు బాలాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి బాలసాహిత్య పురస్కార గ్రహీత డా. పత్తిపాక మోహన్‌ కీలక ప్రసంగం చేశారు.  ప్రముఖ బాలసాహితీవేత్త, మెజీషియన్‌, కేంద్ర సాహిత్య అకాడమి బాలసాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ కథలు చెప్పడంలోని నైపుణ్యాలను ఆసక్తికరంగా వివరించారు.ట్రస్మా అధ్యక్షుడు సద్దుల మధుసూదన్‌ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. డా. మాడభూషి రంగాచార్య స్మారక సంఘం కన్వీనర్‌ మాడభూషి లలితాదేవి స్వాగతం పలికి కార్యశాల ఉద్దేశాలను వివరించారు. డా. హారిక చెరుకుపల్లి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.