వైసిపి నేత ఒంటెద్దు నాయుడు కలిసిన కూటమి నేతలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒంటెద్దు వెంకన్నాయుడును ఆయన నివాసంలో మూడవ వార్డు కూటమి (టిడిపి) కౌన్సిలర్ అభ్యర్థి ఆశెట్టి నాగదుర్గ, అమలాపురం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి నల్లా శ్రీధర్ సోదరి నల్లా యశోద తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేసి మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత కంచిపల్లి అబ్బులు, ఆశెట్టి ఆదిబాబు, బోణం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.