ప్రపంచ రికార్డు సాధించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థి : సాయిఫణి చరణ్‌ను ప్రశంసించిన చాన్సలర్ విజయ్ భాస్కర్ చౌదరి
మదనపల్లె,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం ఏఐఎంఎల్ చదువుతున్న విద్యార్థి సాయి ఫణిచరణ్ ఎస్.ఎం.అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సాధించడం యూనివర్సిటీకి గర్వకారణమని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ 2026 జూలై 6న ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక ప్రయత్నంలో విద్యార్థి తన చూపుడు వేలిపై పుస్తకాన్ని నిరంతరాయంగా 2 గంటల 9 నిమిషాలపాటు తిప్పి లాంగెస్ట్ టైమ్ టు స్పిన్ ఏ బుక్ ఆన్ ఇండెక్స్ ఫింగర్ (టీనేజర్) అనే విభాగంలో రికార్డు సాధించారు.ఈ విభాగంలో గతంలో నమోదైన 1 గంట 49 నిమిషాల 25 సెకన్ల రికార్డును అధిగమించడం విశేషమన్నారు.ఈ ఘనతకు సంబంధించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు రికార్డు సాధనగా గుర్తింపు పొందినట్లు తెలియజేశారు.రికార్డు సాధించిన సమయంలో విద్యార్థి వయస్సు 19 సంవత్సరాల 3 నెలల 16 రోజులుగా గుర్తింపు లభించింది.విద్యార్థి సాధించిన ఈ అరుదైన విజయం ఏకాగ్రత,పట్టుదల,క్రమశిక్షణ,సహనం,నిరంతర సాధనకు నిదర్శనమన్నారు.విద్యతోపాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన సాయి ఫణి చరణ్‌ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ ఎన్.విజయ భాస్కర్ చౌదరి,ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల,రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్,అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ మంజునాథ్,అధ్యాపకులు,విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి