జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు
ఆలమూరు మేజర్ న్యూస్ :ఆలమూరు మండలం పినపల్ల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. పినపల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఆధ్వర్యంలో చామకూరు శివరాం, కోట రాజు, గుత్తుల నాగేశ్వరరావు, బేతా వీర్రాజు, పిల్లి రాజుతో పాటు సుమారు 20 కుటుంబాల వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగిన కొనగళ్ల ధనరాజు నాయుడు, 2019లో పినపల్ల గ్రామంలో జనసేన తరఫున సర్పంచ్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆలమూరు మండలంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ చురుకుగా వ్యవహరించారు. పార్టీ కోసం ఆది నుంచి కష్టపడి పనిచేసిన నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం లభించలేదన్న అసంతృప్తితో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వం, ప్రజల పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ లక్ష్యాలు తమకు నచ్చడంతోనే పార్టీలో చేరినట్లు కొనగళ్ల ధనరాజు నాయుడు తెలిపారు.
చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో ఒక కీలక మండల స్థాయి నాయకుడితో పాటు 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆలమూరు మండలంలో పార్టీకి మరింత బలాన్నిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలతో నిరంతర సంబంధాలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.