ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి
కదిరి మున్సిపాలిటీలోని 11వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా మౌలాలి ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచారు. ఆదివారం వార్డు పరిధిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ అభ్యర్థి షాకీరా మౌలాలి లకు వార్డు ప్రజలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగానే ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపిం చాలని ఓటర్లకు కౌన్సిలర్ అభ్యర్థి కోరారు. గత నాలుగు రోజులుగా వార్డులోని పలు వీధుల్లో ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజల సైతం ఆశీర్వాదాలు అందజేస్తూ మద్దతు ప్రకటిస్తూ అభినందనలు తెలుపు తున్నారు. ఇంటింటా పర్యటిస్తున్న సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసు కుంటూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాను కౌన్సిలర్ గా ఎన్నికయితే పథకం అర్హులైన వారికి వర్తింపజేసేలా కృషి చేస్తానని తెలియ జేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సహకారంతో వార్డును అభివృద్ధి పరస్థానని.. వార్డుకు అధికంగా నిధులు మంజూరు చేసేలా చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. విభిన్న శైలిలో ప్రచారాన్ని కౌన్సిలర్ అభ్యర్థి కొనసాగిస్తుం డడంతో ఓటర్ల సైతం మద్దతు పలకడం చర్చనీ యాంశంగా మారుతుంది. వార్డును వైపు నుండి ప్రచార కార్యక్రమం ద్వారా తిప్పేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.