BREAKING
ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

Select Suryaa Now
పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

నారాయణఖేడ్ ; నారాయణఖేడ్ నియోజకవర్గంనగల్‌గిద్దా మండల పరిధిలోని మావినెల్లి కిషన్ నాయక్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవాల్లో ఆదివారం ముఖ్యఅతిథిగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. సమాజంలో నిరుపేదలు ఆత్మగౌరవంతో, సురక్షితంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజన తండాలు, మారుమూల గ్రామాల సమగ్ర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు తండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.