BREAKING
హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు నిర్ధారణ నుంచి పునరావాసం వరకు ఒకే వేదికపై.. కిమ్స్‌ రెనోవాలో ప్రత్యేక కార్యక్రమం బాలల సృజనాత్మక వికాసానికి పఠనం, ఆటపాటలు అవసరం పలు చర్చిలలో ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిని దీనగ్లాడి పర్యటన ఏలూరు, 32వ వార్డు టిడిపి అభ్యర్థినికి పెరుగుతున్న ప్రజాదరణ : కూటమి నేతలతో కలిసి తలారి రాధమ్మ విస్తృత ప్రచారం వైసిపి అభ్యర్థుల విజయం కోసం తండ్రి, తనయుల ప్రచారం వైసిపి నేత ఒంటెద్దు నాయుడు కలిసిన కూటమి నేతలు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చీరలు, భోజనం పంపిణీ హైదరాబాద్‌లో ఘనంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం రొమ్ము క్యాన్సర్‌పై అవగాహనకు మెడికవర్ 10 కి.మీ. సైక్లోథాన్ ‘పెడల్ ఎగైనెస్ట్ క్యాన్సర్’తో ముందస్తు గుర్తింపుపై అవగాహన మల్లవరంలో ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శంభాలా 360 సొల్యూషన్స్ ప్రారంభం విస్తృతంగా కార్టూన్ అండ్ చర్చ్ ఆపరేషన్ హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ

కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Select Suryaa Now
కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

సూర్య- బిక్కనూర్ ;;కూరగాయల సాగుతూ రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. ఆదివారం మండలంలోని గురజకుంట గ్రామంలో 58 మంది రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న రాయితీలను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో పంట మార్పిడి చేపట్టి కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ప్రత్యేక రాయితీలు అందిస్తోందన్నారు.కూరగాయల సాగుకు ఎకరాకు రూ.9,600, మల్చింగ్ విధానం కోసం ఎకరాకు రూ.8,000 చొప్పున మొత్తం రూ.17,600 వరకు రాయితీ అందించనున్నట్లు  తెలిపారు.గ్రామానికి చెందిన 58 మంది రైతులకు ఈ పథకం కింద సుమారు రూ.4 లక్షల మేర ప్రభుత్వం నుంచి రాయితీలు మంజూరయ్యాయి. రాయితీలతో లబ్ధి పొందిన రైతులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు సాగులో కొత్త పద్ధతులను అనుసరించి మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,గురజకుంట గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి, తిప్పాపూర్ గ్రామ సర్పంచ్ కుంట లింగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.