హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శంభాలా 360 సొల్యూషన్స్ ప్రారంభం
చైతన్య పరిశోధన, ఆధ్యాత్మిక సాహిత్యం, నూతన ఉత్పత్తులు, డిజిటల్ సేవలకు ఒకే వేదిక
సోమాజిగూడ /మేజర్ న్యూస్ : హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శంభాలా 360 సొల్యూషన్స్ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. రాజకీయ, సినీ, పరిశోధన, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సినీ నటీమణులు చల్లా జయలలిత, మంజు భార్గవి, నటుడు శివకృష్ణ, దర్శకుడు ఎన్. శంకర్, నారీ శక్తి ఫోరం వ్యవస్థాపకులు డాక్టర్ మొహమ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట కె. గంజాం తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
చైతన్య పరిశోధకులు, ఎనర్జీ సైంటిస్ట్ డాక్టర్ కె. హరి హర నాధ రాజు, వీశం సాయిదేవ్ కార్యక్రమానికి నేతృత్వం వహించి సంస్థ లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.ఈ సందర్భంగా శంభాలా ఆస్ట్రా–PEMF పరికరం, శంభాలా పిల్లో, సీట్ మ్యాట్రెస్, భగవద్గీత మహాగ్రంథంతో పాటు మరో ఎనిమిది మహాగ్రంథాలు, ఆహార ఉత్పత్తులు, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.
చైతన్య పరిశోధన, ఎనర్జీ సైన్స్, ఆధ్యాత్మిక విజ్ఞానం, వినియోగదారుల ఉత్పత్తులు, డిజిటల్ సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడమే సంస్థ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి ఉపయోగపడే సేవలను విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.