BREAKING
ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

విస్తృతంగా కార్టూన్ అండ్ చర్చ్ ఆపరేషన్

Select Suryaa Now
విస్తృతంగా కార్టూన్ అండ్ చర్చ్ ఆపరేషన్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు

నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ  డి. నరసింహ కిషోర్, ఆదేశాల మేరకు, ఎస్‌బీ డీఎస్పీ  రామకృష్ణ  పర్యవేక్షణలో, సౌత్ జోన్ డిఎస్పి ఏ శివప్రియ  ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్  నిర్వహించారు.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంతోపాటు నేరాలను నియంత్రించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా ఈ ముందస్తు తనిఖీలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా పాత నేరస్తులు, గతంలో గంజాయి కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానితుల నివాసాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ఆయుధాలు, చట్టవిరుద్ధ వస్తువుల కోసం సోదాలు చేపట్టడంతోపాటు, సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్లు ఏఐ పేస్ ట్రాకర్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా అనుమానితులను చెక్ చేశారు . వాహనాలను తనిఖీ చేసి వాటికి సంబంధించిన రికార్డులు, ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో సరైన రికార్డులు, ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా వాహనాలకు సంబంధించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్, సస్పెక్ట్ షీటర్లకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, నేరాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

అనంతరం అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.

ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు..