హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ నేతృత్వంలో దేశ రక్షణ ధర్మ రక్షణ మహా యాగం మూడవ రోజు న ఈ రోజు పుష్ప గిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతీ స్వామి వారుఆదివారం జరిగిన పూర్ణా హుతి లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇంట్లో రోజూ దీపం పెడితే అది కూడా యజ్ఞం అని అన్నారు.
ఇలాంటి యజ్ఞం వల్ల సమాజం లో ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది అని స్వామి జి అన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి దంపతులు యాగ కర్తలు గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మా శ్రీ రాఘవ శర్మ, కరణం నరేష్ శర్మ సారథ్యం లో పూర్ణా హుతి పరిసమాప్తం అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ లో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జూన్ 2 వ తేదీ నుండి నరేంద్ర మోడీ కి శని దశ మొదలు కాబోతుందని, అయితే ఈ రోజు చేసిన యాగం వల్ల అది సమసి పోతుందని చెప్పారు.
డాక్టర్ అనంత లక్ష్మి మాట్లాడుతూ దేశ రక్షణ లో ఇలాంటి యాగం అవసరం అన్నారు. వేడుక లో ప్రవచన కర్త దేవికా రాణి, రం గి సత్యనారాయణ శాస్త్రి, యమునా పాఠక్, వాణి, శ్రీ కృతి, మరు మాముల వెంకట రమణ శర్మ సోదరులు, పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దలు పాల్గొన్నారు.-