అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి
మదనపల్లె,మేజర్ న్యూస్ : అభివృద్ధి చేశాం,మరో అవకాశం కల్పించాలని,జగనన్న పాలన స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందిస్తామని 21,20వ వార్డుల వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా పేర్కొన్నారు.ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి వార్డు పరిధిలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారానికి సీనియర్ నాయకులు దేవతా సతీష్ హాజరయ్యారు.ఇందులో భాగంగా వార్డులోని ప్రజలను కలిసి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దేవతా సతీష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించారన్నారు.జగనన్న పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.అదేవిధంగా 20,21 వార్డులలో పోటీ చేస్తున్న షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లాలను ఆదరించాలన్నారు.గతంలో షేక్ షబానా కౌన్సిలరుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు.అనంతరం ఎస్.ఏ కరీముల్లా,షబానాలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామన్నారు.స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ,వార్డు అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు,కార్యకర్తలందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.తమకి కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,వైకాపా సమన్వయకర్త నిసార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి