BREAKING
ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

బాసరలో అలరించిన అష్టావధానం

Select Suryaa Now
బాసరలో అలరించిన అష్టావధానం

సూర్య భైంసా;బాసరలోని శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమం, సరస్వతీ స్తూపం, కోటి పార్థివలింగ స్తూపంతో కూడిన ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఆదివారం అష్టావధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తెలుగు కళానిలయం ఆధ్వర్యంలో, నిర్మల్‌కు చెందిన అంబికానాథ శర్మ సౌజన్యంతో ప్రముఖ కవులు కడారి దశరథ్, పీసర శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ అష్టావధాన కార్యక్రమానికి బానావత్ నితిన్ నాయక్ అవధానిగా వ్యవహరించారు. నిషిద్ధాక్షరిలో కోవెల శ్రీనివాసాచార్యులు (విశ్రాంత ప్రధానోపాధ్యాయులు), సమస్యాపూరణలో కడారి దశరథ్ (తెలుగు ఉపాధ్యాయులు), దత్తపదిలో జాదవ్ పుండలీక్ రావు పాటిల్ (తెలుగు ఉపాధ్యాయులు, జీడీఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ అకౌంటెంట్), వర్ణనలో పీసర శ్రీనివాస్ గౌడ్ (సీనియర్ జర్నలిస్ట్),ఛందోభాషణంలో బొందిడి పురుషోత్తమరావు (విశ్రాంత ఉపాధ్యాయులు), ఆశువులో పడిగెల దేవీదాస్ (తెలుగు ఉపాధ్యాయులు),అప్రస్తుత ప్రసంగంలో గంగుల చిన్నన్న (సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు)  న్యాస్తాక్షరిలో కృష్ణ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవధాని తన సాహితీ ప్రతిభతో వివిధ అంశాలకు సమయస్ఫూర్తితో సమాధానాలు అందించి సభికులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి తెలుగు పండితులు, భాషాభిమానులు, కవులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.