BREAKING
ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు ఈటల రాజేందర్‌ను కలిసిన బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి అంగరంగ వైభవంగా గురుమా సనాతన సత్సంగ్ : నగరంలోని గోల్డెన్ టెంపుల్‌ కు ఆధ్యాత్మిక శోభ ప్రపంచ రికార్డు సాధించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థి : సాయిఫణి చరణ్‌ను ప్రశంసించిన చాన్సలర్ విజయ్ భాస్కర్ చౌదరి విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు నిర్ధారణ నుంచి పునరావాసం వరకు ఒకే వేదికపై.. కిమ్స్‌ రెనోవాలో ప్రత్యేక కార్యక్రమం బాలల సృజనాత్మక వికాసానికి పఠనం, ఆటపాటలు అవసరం పలు చర్చిలలో ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిని దీనగ్లాడి పర్యటన ఏలూరు, 32వ వార్డు టిడిపి అభ్యర్థినికి పెరుగుతున్న ప్రజాదరణ : కూటమి నేతలతో కలిసి తలారి రాధమ్మ విస్తృత ప్రచారం వైసిపి అభ్యర్థుల విజయం కోసం తండ్రి, తనయుల ప్రచారం వైసిపి నేత ఒంటెద్దు నాయుడు కలిసిన కూటమి నేతలు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చీరలు, భోజనం పంపిణీ

ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా

Select Suryaa Now
ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయితన క్షేత్రంలో 59వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నవరాత్రి మహోత్సవాల అనంతరం జరిగిన రథోత్సవ కార్యక్రమం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఏడు రాష్ట్రాల నుండి వచ్చిన 225 మంది కళాకారులతో కనుల విందుగా వెండి రథంపై వాసవి మాత ఊరేగింపు జరిగింది. ఏడాదికి ఏడాదికి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా కళాకారులను తీసుకొని వచ్చి రంగ రంగ వైభవంగా ఈ కార్యక్రమంలో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాలుగా తాను రథోత్సవంలో కొత్తదనంతో కూడిన కళాకారులను తీసుకుని వచ్చి అమ్మవారి రథోత్సవం వైభవంగా జరిపించామని తెలియజేశారు. ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాస్ రావు, గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ముందుగా కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రథోత్సవానికి ఒక ప్రత్యేకత ఉందని దానికి అనుగుణంగా ఆర్య వైశ్యులు, వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవైశ్య మహిళా సంఘం, ఐవిఎఫ్, పలు సంఘాల సభ్యులు సహాయ సహకారాలతో 5000 మందికి చక్కర పొంగలి, పులిహోర, శనగల ప్రసాదాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్ల రాము, కార్యదర్శి నున్న సుందరం, కోశాధికారి భోగవల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు ఆలపాటి చిన్న ఆలపాటి సత్యనారాయణ మరియు కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ఎంతో వైభవభ్రంగా నిర్వహించమని తెలియజేశారు.108 కళాశాలతో మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. 75 మంది మహిళలతో కోలాటం, కోయంబత్తూర్ నుంచి తీసుకొచ్చిన కృత్రిమ ఏనుగు విన్యాసాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. మామూలు ఏనుగు ఎలా ఆశీర్వదిస్తుందో అదే రీతిగా భక్తులను ఆశీర్వదించటం, తొండంతో నీళ్లు కొట్టడం, తలవపటం వంటి ఎన్నో చర్యలు చేసింది. కోయంబత్తూర్ నుంచి తెచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఏనుగు మాత్రం సాధారణ ఏనుగు మాత్రమే ఉండడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా