andhrapradesh
ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి ; ఎమ్మిగనూరు పట్టణంలోని 26, 25వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు బోయ రంగమ్మ, శ్రీధర్‌రెడ్డిల తరఫున వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి భర్త పామయ్యతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. మిలిటరీ కాలనీ, వెంకటాపురం గ్రామాల ప్రజలు దాదాపు మూడు దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చొరవతో రహదారి సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. మిలిటరీ కాలనీ ఏర్పడి 25 ఏళ్లు గడిచినా కనీసం మట్టి రోడ్డు కూడా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వైసీపీ ప్రభుత్వంలోనే రోడ్డు సౌకర్యం అందిందని అన్నారు.గతంలో 100 అడుగులుగా ఉన్న రహదారిని 40 అడుగులకు కుదించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెబుతూ శివారు ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచారని ఆరోపించారు. “మేము పక్కా లోకల్.. మీ సమస్యలే మా సమస్యలు” అంటూ ప్రజలకు భరోసా కల్పించారు. ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ అభ్యర్థులను బలపరిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో నరసింహులు, బోయ మల్లికార్జున, తిప్పలి సూర్యనారాయణ, శివరాం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.