BREAKING
మల్లవరంలో ఎంపీటీసీ అభ్యర్థి ప్రచారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శంభాలా 360 సొల్యూషన్స్ ప్రారంభం విస్తృతంగా కార్టూన్ అండ్ చర్చ్ ఆపరేషన్ హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పరీక్షను వాయిదా వెయ్యాలి... ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి స్విట్జర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు: మీరే తెలంగాణ నిజమైన సాంస్కృతిక రాయబారులంటూ ప్రశంసలు! యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు అరెస్ట్ సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదిన వేడుకలు ఘనంగా గరుడువాహన సేవ దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..!

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. ...అదనపు పోలీస్ కమిషనర్ ఎన్.శుభం ప్రకాష్.

Select Suryaa Now
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.  ...అదనపు పోలీస్ కమిషనర్ ఎన్.శుభం ప్రకాష్.
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్‌లో సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ పూలాంగ్ చౌరస్తా వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రగతి హాస్పిటల్, ఎల్‌ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది.
   ఈ సందర్భంగా ఎన్. శుభం ప్రకాష్ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత కోసం పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని పేర్కొన్నారు. నక్సలైట్లు, మతతత్వ విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రజల రక్షణ కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. దేశం, న్యాయం కోసం నిష్పక్షపాతంగా సేవలందించాలని, పోలీసు యూనిఫాం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు.జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఆర్మ్‌డ్ రిజర్వ్, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.