పరీక్షను వాయిదా వెయ్యాలి...
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదిక గా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్ గారు మాట్లాడుతూ నవంబర్ 6 న జరిగే అయి ఏ ఈ ఈ పరీక్ష ను పోస్టుపోన్ చేయాలి అన్ని డిమాండ్ చేసారు. అదే రోజున ఎస్ఎస్సి నిర్వహించే ఎస్ఎస్సి జే ఈ ఉంది అన్ని ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటంతో ఏళ్ల తరబడి కష్టపడిన విద్యార్థులు ఒకదానిని వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అన్ని అన్నారు.
అసలే నోటిఫికెషన్స్ లేక గత 3 సంవత్సరాల నుండి నిరుద్యోగులు ఎన్నో కష్టాలు పడుతున్నారు అన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అన్ని వచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా నిర్వహించకపోతే ఎలా అన్ని ప్రశ్నించాడు.. ప్రభుత్వాన్ని మరియు టీజీపిఎస్సీ ఛైర్మెన్ గారిని వేలాది మంది ఇంజనీరింగ్ నిరుద్యోగ విద్యార్థులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకొని పరీక్షను వాయిదా వెయ్యాలి అన్ని కోరారు. ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జేఏసీ నాయకులు కుమార్ రాథోడ్, హుస్సేన్,చరణ్ మహిపాల్, సాయి,తదితరులు పాల్గొన్నారు.