BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..!

Select Suryaa Now
దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..!

దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..!
- నందికొట్కూరు పరిధిలో ఎక్సైజ్ దాడులు 
-  90 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
-  మద్యం దుకాణాలలో శాంపిళ్ల సేకరణ 
- పట్టణంలో మద్యం దుకాణాలు తనిఖీ

​నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: అక్రమ మద్యం తయారీ, రవాణా మరియు విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు నందికొట్కూరు నియోజవర్గంలో దాడులతో దడ పుట్టిస్తున్నారు. ఆదివారం
నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి  సాధు రవికుమార్  ఆదేశాల మేరకు, నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. రామాంజనేయులు ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.​ఈ తనిఖీల్లో భాగంగా నందికొట్కూరులోని షీకారీ కాలనీలో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తయారు చేసిన సుమారు 90 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకుని సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పగిడ్యాలలోని 'రవి వైన్స్ మరియు నందికొట్కూరులోని 'రాజా వైన్స్' మద్యం దుకాణాల తనిఖీ చేసి సదరు మద్యం షాపుల నుంచి మద్యం నాణ్యతా పరిశీలన నిమిత్తం  షాప్ శాంపిళ్లను సేకరించారు. సాయంత్రం అల్లూరు మరియు మాల్యాల క్రాస్ రహదారి వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు  నిర్వహించారు.​ఈ దాడులు మరియు తనిఖీలలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు భాష్యం శ్రీనివాసులు, హరిత మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.