ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం
-ముషీరాబాద్ మేజర్ న్యూస్ ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం – విధి నిర్వహణలో ఉన్న కార్మికులకు రక్షణ కల్పించాలి!..మణుగూరు డిపో కండక్టర్ ప్రవళ్లిక ఘటనపై బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో విధులు నిర్వహిస్తున్న మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళ్లికపై జరిగిన దాడి ఘటనను బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది.
ఆధార్ కార్డు లేకపోవడంతో టికెట్ తీసుకోవాలని సూచించిన కండక్టర్ ప్రవళ్లికను ప్రయాణికురాలు తోసివేయడంతో ఆమె కిందపడి ప్రమాదానికి గురైన ఘటన అత్యంత బాధాకరమని యూనియన్ నాయకత్వం పేర్కొంది. ప్రయాణికులకు నిరంతరం సేవలందిస్తూ, వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులపై దాడులకు పాల్పడటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేసిందిసాజిద్ మహమ్మద్,రాష్ట్ర అధ్యక్షులు బహుజన వర్కర్స్ యూనియన్ సుద్దాల సురేష్రాష్ట్ర ప్రధాన కార్యదర్శిబహుజన వర్కర్స్ యూనియన్ ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు