BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత

Select Suryaa Now
డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్                     -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె  కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత

ఏలూరు మేజర్ న్యూస్ జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్  ఆదేశాలపై ఆపదలో ఉన్న వారికి అండగా    ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం శక్తి' టీమ్ సభ్యులు మరోసారి నిలిచారు.ఏలూరు పోలీస్ కంట్రోల్ రూమ్‌ కు డయల్ 112 ద్వారా అందిన అత్యవసర కాల్‌ పై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 'శక్తి' టీమ్ తక్షణమే స్పందించి అభాగ్యురాలైన వృద్ధురాలికి ప్రాణదానం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురై, లేవలేని , కదల్లేని నిస్సహాయ స్థితిలో ఒక వృద్ధ మహిళ పడి ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే 'శక్తి' టీమ్ సిబ్బంది ఘటనా స్థలానికి పరుగులు తీశారు.వృద్ధురాలి దీనస్థితిని గమనించిన టీమ్ సభ్యులు వెంటనే మానవత్వం చాటుకుంటూ తమ వాహనంలో ఆమెను ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్  కు తరలించారు.ఆసుపత్రిలో ఆమెను చేర్పించి, వైద్యులకు పరిస్థితిని వివరించి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.మెరుగైన వైద్యం అందించిన అనంతరం ఆ వృద్ధురాలి వివరాలు సేకరించగా ఆమె వివరాలు వెల్లడయ్యాయి.*వృద్ధురాలి పేరు తేలు పాపాయమ్మ భర్త: అప్పారావు, వయస్సు: 74 సంవత్సరాలు, నివాసం: యలమల, పవర్ పేట, ఏలూరు గా గుర్తించారు.*ఈ సమాచారాన్ని వెంటనే ఏలూరు రూరల్ ఎస్సై   ద్వారా సమన్వయం చేసారు. తదనంతరం వృద్ధురాలి కుమార్తె అయిన అన్నపూర్ణ మరిపు భర్త శ్రీనివాస్, వయస్సు: 50 సంవత్సరాలు, నివాసం యలమల, పవర్పేట, ఏలూరు ను సంప్రదించి, చికిత్స పొందిన వృద్ధురాలు పాపాయమ్మను ఆమె కుమార్తెకు పోలీసులు క్షేమంగా సురక్షితంగా అప్పగించారు.సకాలంలో స్పందించి అస్వస్థతతో ఉన్న వృద్ధురాలి ప్రాణాలను కాపాడి, కుటుంబ సభ్యులకు చేర్చిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ సభ్యుల మానవతా దృక్పథాన్ని స్థానికులు , ఉన్నతాధికారులు అభినందించారు.