BREAKING
ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం నవంబర్ 22న శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు

ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి

Select Suryaa Now
ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక సంస్థల ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గంలోని టీడీపీ, కూటమి అభ్యర్థులు విజయం సాధించడము కోసం ప్రతి ఒక్కరూకూటమి కార్యకర్తలు, నాయకులు ప్రత్యేకంగా కృషి చేయాలని ప్రభుత్వ విప్,

 ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పిలుపునిచ్చారు. ఆదివారం మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పిటిసి, ఎంపీటీసీ, ముమ్మిడివరం  నగరపంచాయతిల మున్సిపల్ ఎన్నికలకు సంబందించి ఎన్ డి ఏ కూటమికేడర్ తో చర్చించినారు.  విప్  బుచ్చిబాబు,  జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయితో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా  మాట్లాడుతూ నగర పంచాయతీలోని 23 వార్డుల కౌన్సిలర్లతోపాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థిని గుబ్బల  గంగా రత్న భవానిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఐ పోలవరం ముమ్మిడివరం కాట్రేనికోన తాళ్లరేవు మండలాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పక్క ప్రణాళికలను రూపొందించారు. ప్రజల్లోకి పార్టీ శ్రేణులు కూటమి అభ్యర్థులు వెళ్లి విస్తృతంగా రెండున్నర ఏళ్లుగా కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించి ఓట్ల రూపంలో తమ వైపు మలుచుకోవాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ గొడ్డలి పార్టీ నాయకులు చెప్పే అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. ఎన్నికల నియమాల్ని తప్పి వైసిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడకక్కడే కూటమి నాయకులు అభ్యర్థులు ఖండించాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతగానో చేసామని చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కనులారా చూపాలని జిల్లా టిడిపి అధ్యక్షులు గుత్తుల సాయి అభ్యర్థులకు పిలుపునిచ్చారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చామని ప్రతి అభ్యర్థి తమ గెలుపును సాహసంగా తీసుకోవాలని ఎక్కడ అశ్రద్ధగా ఉండొద్దని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తెలిపారు. కూటమి అభ్యర్థులకు బిజెపి జనసేన నాయకులు మద్దతుగా గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తామని కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, బిజెపి సీనియర్ నాయకులు, మాజీ పశుగణాభివృద్ధి శాఖా చైర్మన్ యాళ్ల దొరబాబు, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, బిజేపి మాజీ జిల్లా అధ్యక్షులు  కర్రి చిట్టిబాబు, బిజెపి పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.