BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

స్టార్లైట్ స్ట్రైడ్స్ – మహిళల నైట్ రన్ 2026 ఆరవ ఎడిషన్‌ గచ్చిబౌలి స్టేడియం లో నిర్వహణ 1,100 మందికి పైగా మహిళల భాగస్వామ్యం – ఆరోగ్యం, భద్రత, సాధికారతకు ప్రాధాన్యం

Select Suryaa Now
స్టార్లైట్ స్ట్రైడ్స్ – మహిళల నైట్ రన్ 2026  ఆరవ ఎడిషన్‌ గచ్చిబౌలి స్టేడియం లో  నిర్వహణ  1,100 మందికి పైగా మహిళల భాగస్వామ్యం  – ఆరోగ్యం, భద్రత, సాధికారతకు ప్రాధాన్యం

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో స్టార్లైట్ స్ట్రైడ్స్ – మహిళల నైట్ రన్ 2026 ఆరవ ఎడిషన్‌ను శనివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియం లో  నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, భద్రత, సాధికారత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,100 మందికి పైగా మహిళా రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, “మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ నైట్ రన్‌లో ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం ఎంతో స్ఫూర్తిదాయకం. స్టార్లైట్ స్ట్రైడ్స్ మహిళా శక్తికి ప్రతీకగా నిలుస్తూ, సమాజ ఆర్థిక, సామాజిక పురోగతిలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రకు గుర్తింపునిస్తోంది. 

ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని మరింత శక్తిమంతంగా ఎదగాలని మేము ప్రోత్సహిస్తున్నాం” అని అన్నారు. సంప్రదాయానికి, ఆధునికతకు ప్రతీకగా పలువురు మహిళలు చీరలు ధరించి పరుగులో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తోటి రన్నర్లు, ప్రేక్షకుల నుంచి వారికి విశేష ప్రోత్సాహం లభించింది. ఈ కార్యక్రమంలో 10కే  టైమ్డ్ రన్, 5కే  టైమ్డ్ రన్, 5కే  ఫన్ రన్ అనే మూడు విభాగాలను నిర్వహించారు. వివిధ వయసులు, శారీరక సామర్థ్యాలు కలిగిన మహిళలు ఇందులో పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు పరుగులో పాల్గొనే అవకాశం కల్పించేందుకు సొసైటీ చేపట్టిన ‘గిఫ్ట్ ఎ రన్’ కార్యక్రమం కింద సభా  సహా పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళలకు ఉచిత రిజిస్ట్రేషన్లు కల్పించారు. 

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఆరు వారాల శిక్షణ కార్యక్రమం ‘విమెన్స్ కౌచ్25కే ’ ముగింపు పరుగులు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన 180 మందికి పైగా మహిళలు 5కే  గ్రాడ్యుయేషన్ రన్‌ను పూర్తి చేశారు. వీరికి మార్గనిర్దేశం చేసిన 17 మంది మహిళా మెంటర్లను ఈ సందర్భంగా సత్కరించారు. మాందిర్ సమర్పణలో నిర్వహించిన ‘రన్ ఇన్ శారీ, విన్ బిగ్’ పోటీ సాయంత్రం వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడించింది. సంప్రదాయ చీరలతో పరుగులో పాల్గొన్న మహిళలకు మొత్తం రూ . 2.5 లక్షల విలువైన గిఫ్ట్ వోచర్లను బహుమతులుగా అందించే ఈ పోటీ విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముందు ఎక్స్‌పోను అక్టోబర్ 23న హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న బ్రాండ్ మాందిర్‌లో నిర్వహించారు. మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు, హైదరాబాద్‌లో మహిళలకు మరింత సురక్షితమైన, సమ్మిళితమైన, ఆరోగ్యకరమైన రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించడంలో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ తన నిబద్ధతను స్టార్లైట్ స్ట్రైడ్స్ ద్వారా మరోసారి చాటుకుంది.