దేవాదాయ కమిషనర్ హనుమంతరావు సేవలు అద్భుతం
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : దేవాదాయ కమిషనర్ హనుమంతురావు అర్చక, ఉద్యోగులకు చేస్తున్న సేవలు అద్భుతమని అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచార్యులు, అర్చక జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ లు పేర్కొన్నారు. కమిషనర్ గా వచ్చిన తక్కువ వ్యవధిలోనే దేవాదాయ శాఖలో ఆయన చేపట్టిన సంస్కరణలు వెలకట్టలేనివిగా కొని ఆడారు. బాధ్యతలు చేపట్టగానే 33 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర 190 పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రిన్సిపల్ సెక్రెటరీ తో సమన్వయం చేసుకుంటూ భర్తీ చేయడం గొప్ప విషయం అన్నారు. దేవాదాయ శాఖలో దశాబ్దాల తరబడి పరిష్కారం కానీ అర్చకుల సమస్యల కోసం ప్రత్యేకంగా ధర్మ వాణి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమంది అర్చక కుటుంబాలలో వెలుగులు నింపాడని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా దేవాదాయ శాఖ చరిత్రలో కమిషనర్ నిలిచిపోతారని సూచించారు. ఆర్జెసి రామకృష్ణారావు దేవాదాయ శాఖలోని అర్చకులకు, ఉద్యోగులకు అందిస్తున్న సేవలు మరువలేమని తెలిపారు. శాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలకు తామంతా అండగా నిలుస్తామని అన్నారు. ఏ ప్రభుత్వంలో జరగని పనులు వీరి సర్వీస్ కాలంలో తమకు అందుతూ ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. తామంతా ఆయనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అర్చక నేతలు రవీంద్రాచార్యులు, చింతపట్ల బద్రీనాథ్, గ్రేటర్ అధ్యక్షుడు బండారు జగపతి, కర్ణం మహేష్ శర్మ, అగ్నిహోత్ర చంద్రశేఖర శర్మ, సురేష్ తదితరులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.