జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం
కదిరి మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సెలర్ అభ్యర్థి నాయపు రాజశేఖర్ ప్రచార పర్వంలో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తు న్నారు. ఆదివారం వార్డు పరిధిలో కౌన్సిలర్ అభ్యర్థి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించగా.. ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పవన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, భర్త టిడిపి నాయకులు పారుక్ , టిడిపి నాయకులు హి దాయత్ , ఇలియాజ్, అలీ, హస్ను, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిం చాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఎవరికి చిక్కనంత రీతిలో ప్రచార పర్వాన్ని అందుకొని జెట్ స్పీడుతో ప్రచారాన్ని కొనసాగించడం గమనార్హం. క్రమంలోని చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ గా ఎన్నికైతే చేపట్ట బోయే అభివృద్ధి సంక్షేమాన్ని పాటు ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.